Kala Gnanam: Kalagnanam: Potuluri Veera Brahmendra Swamy Kalagnanam – 5

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి – కాలజ్ఞానం – 5

బ్రహ్మంగారు చేసే కొన్ని పనులు వినేందుకు చాలా విచిత్రంగా ఉండేవి. ఆయన ఒకవైపు కొండగుహలో కూర్చుని కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు. మరోవైపు పశువుల కాపరిగా తన బాధ్యతను నిర్వర్తించేవారు.
తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేందుకు బయల్దేరిన వీరబ్రహ్మేంద్రస్వామి బనగానపల్లెకు చేరారు. ఆరోజు పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయారు. రాత్రికి ఆ ఊరిలోని ఒక ఇంటి వద్దకు చేరారు. నిద్రా సమయం ఆసన్నం కావడంతో అక్కడున్న అచ్చమ్మ అనే స్త్రీ ఇంటిముందు ఉన్న అరుగుపైన నిద్రకు ఉపక్రమించారు.
మరుసటిరోజు పొద్దున్నే అచ్చమ్మగారు, తన ఇంటి అరుగుమీద పడుకున్న వీరబ్రహ్మేంద్రస్వామిని చూశారు. Read More

Kala Gnanam: Kalagnanam: Potuluri Veera Brahmendra Swamy Kalagnanam – 4


పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాల జ్ఞానం – 4 

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన జోస్యాల్లో ఎన్నో నిజమయ్యాయి. ఉదాహరణకు.. 

గట్టివాడయిన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు ..

ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడయిన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమయిన పాలనను అందించారు.
కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. .

వీరివల్ల ప్రజలందరూ మోసపోతారు.. ప్రస్తుతం గాల్లోంచి ఏవేవో వస్తువులు సృష్టించి ప్రజలను మోసం చేసే బాబాలు, కపట సన్యాసులు పెరిగిపోయారు. వీరికి ఏ మహిమలూ లేకపోయినా ప్రజలు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. పైగా ఈ దొంగ స్వాములు భోగవిలాసాలకు బానిసలుగా ఉన్నారు. ఎందరో దొంగ సన్యాసుల గుట్టు రట్టవుతోంది… Read More

Kala Gnanam: Kalagnanam: Potuluri Veera Brahmendra Swamy Kalagnanam – 3


పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాల జ్ఞానం – 3 


వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన కొన్ని జోస్యాలు కొద్దిగా అస్పష్టంగా వుండటం వల్ల, వీటిని అనుసరించి ఖచ్చితంగా ఏ సంఘటనలు ఎక్కడ జరుగుతాయో ఊహించటం అంత సులభం కాదు.
ఉదాహరణకు – బ్రహ్మంగారు చెప్పినది – ”ఆకాశమున రెండు బంగారు హంసలు వచ్చి పురములందు, వనములందు, నదులయందు సంచరించెను. ప్రజలు వానిని పట్టుటకు పోయి కన్నులు గానక గిర గిర తిరిగి లక్షోపలక్షలుగా చచ్చేరు…” వీటికి ఇక్కడ స్పష్టమైన అర్థం లేదు. పేర్లు, వివరాలు లేవు. బంగారు హంసలు అంటే అణుబాంబులు కావచ్చు. అణు బాంబులు పేలినప్పుడు విపరీతమైన మంటలు వస్తాయి. ఇవి పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరయినా మరణించటం ఖాయం…. Read More

Kalagnanam: Potuluri Veera Brahmendra Swamy Kalagnanam – 1


పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాల జ్ఞానం – 1 

అసలు వీరబ్రహ్మేంద్రస్వామి ఎవరు? కాలజ్ఞానం అంటే ఏమిటి? వీరబ్రహ్మేంద్రస్వామి ఏం చెప్పారు, అవి ఎంతవరకూ నిజం అయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటీ తెలుసుకుందాం కాలజ్ఞానం అంటే భవిష్యద్దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించడం యోగులకు, ఋషులకు సాధ్యమే. మన పురాణ పురుషుల సంగతి వదిలేసినా, చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యద్దర్శనం చేసిన వారు ఉన్నారు.
ఇతర దేశాలలోనూ భవిష్యత్ ను తెలుసుకొని, జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోడామస్ అయితే తెలుగువారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్రస్వామి.
రష్యా, టిబెట్, చైనా వంటి సుదీర్ఘ చరిత్ర కలిగి, ప్రాచీన నాగరికతలు వెల్లివిరిసిన దేశాలలో భవిష్యద్దర్శనం చేసిన కొందరి పేర్లు మనకు వినిపిస్తుంటాయి. వారి గురించిన చారిత్రక వివరాలు గ్రంథస్తం చేసి ఉన్నాయి. Read More