Kalagnanam: Potuluri Veera Brahmendra Swamy Kalagnanam – 1


పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాల జ్ఞానం – 1 

అసలు వీరబ్రహ్మేంద్రస్వామి ఎవరు? కాలజ్ఞానం అంటే ఏమిటి? వీరబ్రహ్మేంద్రస్వామి ఏం చెప్పారు, అవి ఎంతవరకూ నిజం అయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటీ తెలుసుకుందాం కాలజ్ఞానం అంటే భవిష్యద్దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించడం యోగులకు, ఋషులకు సాధ్యమే. మన పురాణ పురుషుల సంగతి వదిలేసినా, చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యద్దర్శనం చేసిన వారు ఉన్నారు.
ఇతర దేశాలలోనూ భవిష్యత్ ను తెలుసుకొని, జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోడామస్ అయితే తెలుగువారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్రస్వామి.
రష్యా, టిబెట్, చైనా వంటి సుదీర్ఘ చరిత్ర కలిగి, ప్రాచీన నాగరికతలు వెల్లివిరిసిన దేశాలలో భవిష్యద్దర్శనం చేసిన కొందరి పేర్లు మనకు వినిపిస్తుంటాయి. వారి గురించిన చారిత్రక వివరాలు గ్రంథస్తం చేసి ఉన్నాయి. Read More

Leave a comment